రేపు పల్నాడు జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వెళ్లనున్నారు జగన్.. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చేరుకుంటారు.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.. అయితే, పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.. పోలీసుల…
తాజా పరిణామాలపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాం కేసులో కీలక విషయాలు వెల్లడించింది.. బలవంతంగా వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారని.. వినకపోతే దాడి చేస్తున్నారన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖపై క్లారిటీ ఇస్తూ.. మద్యం స్కాం కేసులో ముడుపులు ఏ1 రాజ్ కేసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరాయి.. గత ఎన్నికలలో ప్రజలకు ఈ డబ్బు చెవిరెడ్డి పంచినట్టు తెలిసింది.. విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్మెన్గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్…
ఇరాన్తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.. కానీ, ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.
సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరిట భారీ మార్పులు.. చేర్పులు చేసి చేతులు కాల్చుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 80 అసెంబ్లీ సీట్లతోపాటు పలు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇన్స్టంట్ కాఫీలాగా... ఇన్స్టంట్ మార్పులు చేసేసి చివరికి 11 సీట్లకు పరిమితమైంది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా... వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారాయన. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకు తిరుగులేదన్నట్టుగా ఉండేది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు పిన్నెల్లి.
అపోజిషన్ లో ఉండి రౌడీయిజం చేస్తానంటే ఇక్కడ ఉంది సీబీఎన్.. రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసుల మీద దాడి చేస్తానంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది అని తేల్చి చెప్పారు. 1996-97లో తీవ్రవాద సమస్య, రాయలసీమలో ఫ్యాక్షన్, హైదరాబాద్ లో మత ఘర్షణలు, గల్లీకొక రౌడీ ఉంటే.. అన్నింటినీ అరికట్టాను.. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
JC Prabhakar Reddy: చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదు..