ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది... సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.. సమావేశానికి మంత్రులు నారాయణ, భరత్, అధికారులు హాజరయ్యారు..
సీఎం చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ.. సవాల్ విసిరారు జగన్.. చంద్రబాబు గారు.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఛాలెంజ్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు..
తిరుమలలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో అడుగు ముందుకేసింది. లడ్డూ కౌంటర్ల వద్ద కియోస్కి మెషిన్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. భక్తులు నగదు రహిత చెల్లింపులతో లడ్డూ ప్రసాదాలు పొందే సౌలభ్యం కల్పించింది. మరో వైపు అదనపు లడ్డూ నియంత్రణపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
AP Governance: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ గా ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి.. అలాగే రాబోయే రెండో ఏడాది…
ఈ కేసులో వైఎస్ జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్నినాని, విడదల రజినీలను నిందితులుగా చేర్చాం అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.