Minister Janardhan Reddy: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నాం.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, స్థానిక పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. సముద్రంలో వృథాగా కలిసి పోయే నీటి శాతం లెక్కలతో సహా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దగ్గర ఉన్నాయని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రిజర్వాయర్, ప్రతి చెరువు నింపడమే సీఎం చంద్రబాబు ముఖ్య ధ్యేయం అని మంత్రి జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Apple iPhone vs Android: ఆపిల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్.. ఏది ఉత్తమం? ఎందుకు?
అలాగే, గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లే అలగనూరు రిజర్వాయర్ మరుగున పడింది అని మంత్రి జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అలగనూరు రిజర్వాయర్ పనులకు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తే సరిపోయేది, తాజా అంచనాల ప్రకారం 100 కోట్ల రూపాయల వరకు అయిన సరిపోనీ పరిస్థితి ఏర్పడింది అని మంత్రి తెలిపారు.