Farmers Struggle In AP: విజయనగరం జిల్లాలోని అన్నదాతలు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల సరఫరా ఇంకా ప్రారంభం కాకపోవడంతో, రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని బొబ్బిలి, తెర్లాం, బలిజిపేట ప్రాంతాల్లోని ఎరువుల డీలర్లు ఒక్కో ఎరువుల బస్తాపై 40 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎరువులతో పాటు అవసరం లేని ఇతర మందులు కూడా తమకు బలవంతంగా అమ్ముతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు.
Read Also: Donald Trump: పుతిన్ ప్రజల్ని చంపుతూ ఉండాలనుకుంటున్నాడు..
అయితే, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంట సీజన్ మొదలైపోయినా, ఎరువులు అందుబాటులో లేకపోవడం అన్నదాతలను ఆందోళనలోకి నెట్టింది. ఎరువుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సమయానికి ఎరువులు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.