తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్ టాపిక్. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్.
ఏపీ బీజేపీ వైఖరి మారుతోందా అంటే.... లేటెస్ట్ వాయిస్ వింటుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరీ ముఖ్యంగా... పదవుల విషయంలో వాళ్లు తీవ్రంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి పదవీ స్వీకార కార్యక్రమం వేదికగా ఆ అసంతృప్తి బయటపడిందని చెప్పుకుంటున్నారు. ఎంతసేపూ.... తమను ఫైవ్ పర్సంట్ వాటాదారుగానే చూస్తున్నారని, ఆ కోణం మారి ప్రాధాన్యం పెంచాలన్నదే ఏపీ కాషాయ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.
వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిశారు వైద్య విద్యార్ధులు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
విద్యార్థులకు అలర్ట్.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల బంద్కు పిలుపునిచింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్.. మన వేదన అందరికీ తెలియచేసే కార్యక్రమానికి అందరి సహకారంతో కార్పొరేట్ స్కూళ్లలో సహా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ఈ రోజున జరిగిన జూమ్ సమావేశంలో తెలియచేసిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు మన సభ్యులందరూ వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ సమస్యలను లేవనెత్తుతున్నారు.. ఇక, మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు వైఎస్ జగన్.. ఇక, జగన్ పర్యటన, ఏర్పాట్లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.. ఈ నెల 9న వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు…
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు అని…
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు.. ఆయనకు ఇంకా సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్.. స్వచ్ఛందంగా ఐపీఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా అంటూ లేఖలో పేర్కొన్నారు..