YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు.
వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలోని పొదలు, గుంతలు, పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాంటి సమయంలో తెలిసీ, తెలియక వాటిపై అడుగేయడం వల్ల కాటేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పదుల సంఖ్యలో పాము కాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. పాములన్నీ విషయ పూరితాలు కావు. రక్తపింజర, కట్లపాము, నాగుపాములు మాత్రం చాలా విషపూరితమైనవి.
అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు వచ్చిన భారీ ప్రజా స్పందనను రావటాన్ని చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది అని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపించింది.
Gudivada Amarnath: యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపించింది తప్ప.. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలను గాలికొదిలేసారు.
Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల 27వ తేదీన హుండీ లెక్కింపులో చిల్లర సంచులను చంద్రావతి కళ్యాణ మండపంలో దేవస్థానం క్యాషియర్లు మంజునాథ్, శ్రీనివాసులు మరిచిపోయారు.
MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడు అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకి వైఎస్ జగన్ వస్తున్నారని సమాచారం తెలిసినప్పుడల్లా.. ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు అని మండిపడ్డారు. 3వ తేదీ పీటీ వారెంట్ వేసి బయటికి తీసుకెళ్లినా.. జగన్ మాత్రం జిల్లాకి రావడం ఖాయం అని తేల్చి చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
తెలుగుదేశం పార్టీని పొలిటికల్ యూనివర్శిటీగా చెప్పుకుంటారు చాలామంది. పార్టీ చరిత్ర, అందులో తయారైన నాయకులు, వాళ్ళు ఎదిగిన తీరును చూసి అలా మాట్లాడుతుంటారు పొలిటికల్ పండిట్స్. రెండు రాష్ట్రాల్లో... కులాలకు అతీతంగా ఇప్పుడున్న సూపర్ సీనియర్స్ చాలామందికి రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీగా టీడీపీకి ప్రత్యేకత ఉంది.