ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది సిట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారా..? మధురై మురుగన్ భక్త సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. సనాతన ధర్మాన్ని వదిలేస్తే మనకి మూలాలే మిగలవని వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతి పరిరక్షణలో తన స్థానం స్పష్టంగా ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా హైందవ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ ఎదుగుతున్నారు జనసేనాని.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న వారికి షాకింగ్ లాంటి న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ప్రకటించారు..
అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు మంత్రి నారా లోకేష్.. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గెలిచింది కూటమికాదు.. ప్రజలు అని పేర్కొన్నారు.. విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటుగా అభిర్ణించారు.. అయితే, ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించాం.. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.. ప్రజలకు చేరువగా వెళ్లి…
జగన్.. రప్పా.. రప్పా.. వ్యాఖ్యలకు పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్.. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.. అయితే, వైసీపీ వాళ్లు రోడ్డు ఎక్కి పిచ్చి బ్యానర్స్..…
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ వైఫల్యం కనిపించడమే కాకుండా ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయి, దిక్కుమాలినిది అయిపోయింది... ఈ స్థాయి కంటే తగ్గి ఇక మాట్లాడలేం... జగన్ వాహనం వల్ల కాదు.. వేరే వాహనం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పిన తర్వాత మళ్లీ మాట…
ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు.. ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఎక్కడ యాక్సిడెంట్ అయిన ఎవరైనా ఏదో ఒక సహాయం చేస్తారు.. స్వయంగా సీఎం చంద్రబాబు దిగి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ, జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోందన్నారు..
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది.. ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..