Srisailam Project: శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణుడు, రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఈరోజు (జూలై 6) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా చెక్ చేశారు. 10వ నంబర్ గేట్ దగ్గర లీకేజీ అవుతుండడంతో పరిశీలించారు. ఈ గేట్ నుంచి లీకేజ్ సుమారు 10 శాతం కంటే తక్కువ ఉంది.. దీని వల్ల సమస్య ఏం లేదన్నారు.
Read Also: IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారీ వర్షం.. భారత్ ఆశలు అడియాసలయ్యేనా..?
అయితే, శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండలి అని కన్నయ్య నాయుడు సూచించారు. అలాగే, కుదిరితే రానున్న ఐదేళ్లలో ప్రాజెక్టులోని రేడియల్ క్రస్ట్ గేట్ల కొత్తవి మార్చుకోవాలని వెల్లడించారు. జలాశయం ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుంది.. ప్రాజెక్టు నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఏర్పడింది.. ఈ ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
Read Also: Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీని వల్ల జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి దాదాపు 1, 35,000 క్యూసెక్కుల వరద చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 878.40 అడుగులకు చేరుకుంది. మరో 24 గంటల్లో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.