Vaishnavi Murder Case: కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. విద్యార్థిని వైష్ణవిని ప్రియుడు లోకేష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు.. ఇక, ఆ బాలికపై రేప్ అటెంప్ట్ కూడా జరగలేదని హత్య మాత్రమే జరిగినట్లు ఆయన పేర్కొన్నారు… నిన్నటి నుండి మైనర్ బాలికను ఆమె ప్రియుడు లోకేష్ పల్సర్ బైక్ పై ఎక్కించుకుని గండికోటకు వెళ్లిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అతనే ఆమెను హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తూ వచ్చారు.. లోకేష్ తమ కుమార్తెను హత్య చేశాడని వైష్ణవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కోవలో పోలీసులు లోకేషను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. అయితే, ఈ రోజు మధ్యాహ్నం పోలీసులకు వైష్ణవి హత్యపై కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.
Read Also: HHVM : నైజాం సొంత రిలీజ్ కాదు.. రంగంలోకి ‘’అమెరికా సుబ్బారావు’’
లోకేష్.. వైష్ణవి ఇరువురు గండికోటలోని ఓ ప్రైవేటు లాడ్జిలో రెండు గంటల పాటు గడిపి ఆ తరువాత ఆ బాలికను గండికోట ముఖ ద్వారం వద్ద లోకేష్ వదిలి వెళ్ళినట్లు డీఐజీ వివరించారు… మైనర్ బాలికపై రేప్ అటెంప్ట్ జరగలేదని, మర్డర్ మాత్రమే జరిగినట్లు డీఐజీ పేర్కొన్నారు.. బాలిక శరీరంపై దుస్తులు లేకుండా పడి ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిది ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.. నిందితుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్..
Read Also: War 2: వార్ 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్
కాగా, వైష్ణవి హత్య కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైష్ణవి మృతదేహానికి మంగళవారం రాత్రి 10 గంటలకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఎర్రగుంట్ల మండలంలోని హనుమనగుత్తికి రాత్రి 12 గంటలకు కుటుంబ సభ్యులు తరలించారు. మృతదేహం రాకతో హనుమనగుత్తిలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం వైష్ణవి స్వగ్రామం హనుమనగుత్తిలో అంత్యక్రియలు ముగిశాయి. అయితే, ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య, దస్తగిరమ్మ దంపతుల కూతురు వైష్ణవి (17). కొండయ్య కుటుంబం చదువుల నిమ్మిత్తం ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని సార్వకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు. వైష్ణవి ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నా అంటూ ఇంటి నుంచి బయలుదేరింది. వైష్ణవి కాలేజీకి రాలేదని లెక్చరర్లు కొండయ్యకు ఫోన్ చేశారు. కాలేజీకి వెళ్లి వైష్ణవి స్నేహితులను ఆరా తీయగా గండికోటకు వెళ్లిందని చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ ప్రొద్దుటూరులో సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం గండికోటలోని రంగనాథస్వామి ఆలయం వెనుక భాగంలోని ముళ్లపొదల్లో వైష్ణవి మృతదేహం లభించడం సంచలనంగా మారిన విషయం విదితమే..