జల జగడం రోజురోజుకీ తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల మధ్య మాటల దాడిని పెంచుతోంది.. తాజాగా.. ఈ వ్యవహారంలో స్పందించిన తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తేలేదు.. ప్రాణాలు పోయినా పోరాడుతామని వ్యాఖ్యానించారు.. తెలంగాణకు ఎవరు నష్టం చేసినా పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన ఆయన.. తెలంగాణ నీళ్లను ఎవరు దోసుకపోయినా అడ్డం నిలబడాలని.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కించపరిచేలా మాట్లాడినా అందరం ఏకతాటిపైకి వచ్చి కాపాడుకోవాలన్నారు.. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాట్లాడుకోవాలని హితవు పలికారు శ్రీనివాస్‌గౌడ్. ఇక, దగాపడ్డ తెలంగాణ నుంచి వచ్చిన మనం ఎంతో మంది ప్రాణాల త్యాగంతో తెలంగాణను తెచ్చుకున్నాం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తలేని పరిస్థితి నుంచి రాష్ట్రం తెచ్చుకున్నామని గుర్తు చేశారు. ఏ శక్తి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదన్న శ్రీనివాస్‌గౌడ్.. ఎవరు కలసి వచ్చినా రాకపోయినా తెలంగాణను కాపాడుకుంటామని వెల్లడించారు.