ఏపీ బీజేపీ నేతలు రూటు మార్చారా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాత చింతకాయ పచ్చడిలా ఉండే ఏపీ బీజేపీ నేతలు.. రూటు మార్చారా? చేస్తున్నదానికీ.. చేయాల్సిన దానికీ తేడా తెలుసుకున్నారా? రెండేళ్ల తర్వాత ఇప్పుడు లైన్‌లోకి వెళ్లారా?
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సమావేశంలో తీవ్ర విమర్శలు!
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
ఏపీ బీజేపీలో రకరకాల గ్రూపులు. అంతా పార్టీ విధేయులైనా ఆయా అంశాలపట్ల ఎవరి తీరు వారిదే. ప్రభుత్వంతో ఎలా ఉండాలి? ప్రధాన ప్రతిపక్షంతో ఎలా వ్యవహరించాలన్న విషయంలోనూ ఎవరి గ్రూప్ వారిదే. అయితే కొద్దిరోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పక్కా ఛేంజ్ కనిపించిదట. ఏపీ సర్కార్‌ను ఒకమాట అనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే నాయకులు ఎగబడి విమర్శలు చేశారట. సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి.. ఆ మాటలు.. విమర్శలు కాస్త కొత్తగా అనిపించాయట.
గతానికంటే భిన్నంగా సాగిన సమావేశం
ధాన్యం కొనుగోలు, పన్నుల పెంపు వంటి అంశాలపై ఇప్పటికే నిరసన తెలిపిన బీజేపీ తదుపరి కార్యచరణపై సమావేశం పెట్టుకుంది. ఆ భేటీలో వైసీపీ లక్ష్యంగా హాట్ కామెంట్స్ చేశారట పార్టీ నేతలు. అధికారపక్షాన్ని విపక్షం విమర్శించడం సాధారణమే అయినప్పటికీ గతానికంటే భిన్నంగా జరిగిందట సమావేశం.
ఏపీ పదేళ్లు వెనక్కి పోయిందని నేతల ఫైర్!
ఏపీలో రాజకీయంగా వ్యాక్యూమ్ ఉందని.. దానిని ఫిల్ చేయాలనేది బీజేపీ ఆలోచన. ఆ క్రమంలోనే వైసీపీ సర్కార్ రెండేళ్ల పాలనపై సమావేశంలో తీర్మానం చేసింది. ఈ రెండేళ్లలో ఏపీ పదేళ్లు వెనక్కి పోయిందని మండిపడ్డారట నాయకులు. విమర్శల ఘాటు పెంచారట. గతంలో ఆచితూచి పదప్రయోగం చేసిన ఎంపీ జీవీఎల్ సైతం రూటు మార్చడం ఆశ్చర్యపరిచినట్టు చెబుతున్నారు. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని.. శాంతిభద్రతలు సరిగా లేవని మండిపడ్డారట. కేంద్రం ఇస్తున్న నిధులతో చేపట్టిన పోలవరం తప్ప రాష్ట్రంలో మరే ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు సాగడం లేదని అభిప్రాయపడ్డారట కమలనాథులు.
మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కైయ్యారని ఆరోపణలు
ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారని ఆయన సమావేశంలో ఆరోపించారట. కేంద్రం నిధులు వాడుకుంటూ ఎక్కడా ప్రధాని మోడీ పేరు చెప్పడం లేదని బాధపడ్డారట బీజేపీ నాయకులు. ఇలా చాలా అంశాలు స్టేట్ కమిటీలో ప్రస్తావనకు రావడం.. గతానికంటే భిన్నంగా వాటిపై స్పందిచడమే పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
చంద్రబాబు, గత ప్రభుత్వ ప్రస్తావన లేకుండా సాగిన సమావేశం
ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే గత సర్కార్‌ను ప్రస్తావించకుండా బీజేపీ నేతలు ప్రకటనలు చేయరనే అభిప్రాయం.. చర్చ ఉంది. ఈసారి మాత్రం గత ప్రభుత్వం పేరు, చంద్రబాబు ప్రస్తావన లేకుండానే సమావేశం జరిగిందట. ముఖ్యంగా అటు ఇటుగా మాట్లాడతారనే వారు కూడా ఒకే లైన్‌లో తమ అభిప్రాయలు చెప్పారట. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్ హాజరయ్యారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక ప్రణాళికతో పోరు మొదలు పెట్టాలని ఆయన సూచించారట. మరి.. మారిన వైఖరి.. పదునైన విమర్శలు అంతర్గత సమావేశాలకే పరిమితమా.. లేక బయట కూడా దూకుడుగా వెళ్తారో లేదో చూడాలి.
- Tags
- Andhra Pradesh
- AP BJP
- bjp
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!