తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతూనే ఉంది.. ప్రధానికి, కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు తాజాగా ఏపీ లేఖలు రాయడంపై భగ్గుమంటున్నారు తెలంగాణ మంత్రులు, నేతలు.. ఆ విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయారు.. అక్కడా తెలుగువాళ్లున్నారు… ఇక్కడా తెలుగువాళ్లున్నారని.. బూతులు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ…
నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత స్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు.. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని స్పష్టం చేసింది సర్కార్.. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు..…
ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.. ఏప్రిల్ 8న మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశం కారణంగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. తాజాగా తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కొత్త వాదన సరికాదన్న ఆయన.. నీటి వాటాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి అనడంలో ఆంతర్యం చెప్పాలి? ఏపీ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది… రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,759 సాంపిల్స్ ని పరీక్షిచంగా.. 3,464 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 35 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్క రు, కర్నూల్లో ఒక్కరు, పశ్చి…
జలవివాదంపై మరోసారి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తమ వైపు నుంచి పూర్తి సంయమనంతో ఉన్నామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం భంగం కలగకుండా, పక్క రాష్ట్రంతో అనవసర వివాదాలు ఉండకూడదన్నదే తమ విధానామని పేర్కొన్నారు. కనీస నీటి మట్టం లేకుండానే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని.. రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉభయ రాష్ట్రాలకు ఉందని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. read also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు…
అమరావతి : ఏపీలో సేంద్రియ వ్యవసాయ పాలసీ పై కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ కమిటీతో సమావేశమయ్యారు మంత్రి కన్నబాబు. ఇందులో భాగంగానే బయో ఫెర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్, ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి, కమిటీ సభ్యుల చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని.. సంబధిత శాఖల సూచనలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సేంద్రియ…