గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు చెందిన శిరీష అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగానూ నిలిచింది. అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో భారతీయురాలిగా గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు. టీమ్‌లో ఆమెతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు. కాగా శిరీషకు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ టీమ్ సక్సెస్ అవ్వాలని విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి శిరీషకు అభినందనలు తెలిపారు. నక్షత్రాలను అందుకోబోతున్న మొదటి తెలుగు మహిళను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. భారతీయులందరు అభిమానిస్తూ.. మీ మిషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు’ అంటూ తెలిపారు.