కృష్ణా జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా… ఈ వ్యహారంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… తెలంగాణపై మండిపడ్డారు.. ఏపీకి నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు అవలంభిస్తోందన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్టు తెలిపారు.. దీనిపై రేపు కర్నూలు వేదికగా.. రాయలసీమ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. మరోవైపు.. రాష్ట్రంలో జగనన్న ఇళ్లు అర్జెంటుగా కట్టేయాలంటూ లబ్ధిదారను ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇక, చంద్రబాబు హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లకు కేంద్రం 4,500 కోట్ల సబ్సిడీ పూర్తిగా ఇచ్చేసిందన్న సోము వీర్రాజు.. రాష్ట్రంలో నెరవేరాల్సిన మోడీ అన్న సొంతింటి కలకు జగనన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు.. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మారకంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బీజేపీ శ్రేణులతో కలసి మొక్కలు నాటిన సోము వీర్రాజు.. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.