ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య క్రమంగా కిందికి దిగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,532 సాంపిల్స్‌ను పరీక్షించగా… 2,930 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 36 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్‌లో నలుగురు చొప్పున, కడప, ప్రకాశం, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున, అనంతపూర్, కృష్ణా, విశాఖలో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 4,346 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..
ఇక, నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 2,22,68,483గా బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,99,748కు పెరగగా.. మొత్తం రికవరీ కేసులు 18,51,062కి చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 12,815కు పెరగగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 35,871గా ఉన్నాయి.. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 591 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 443, ప్రకాశం జిల్లాలో 363 కేసులు, పశ్చిమ గోదావరిలో 338 కేసులు వెలుగు చూశాయి.