కర్నూలు : దేవరగట్టు బన్నీ ఉత్సవాల పై సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కర్రల సమరంలో చాలా మంది తీవ్ర గాయాల పాయాలవుతున్నారని..కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని లేఖలో సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. దేవరగట్టు ఉత్సవాలను శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూడద్దని సూచించారు సీపీఐ రామకృష్ణ. ఉత్సవాలకు ఆ రెండు రోజులు బందోబస్తు మాత్రమే కాదని… నిత్యం ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలూరు ప్రాంతంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలని.. వయోజన విద్య అమలు చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ రామకృష్ణ. కర్రల సమరంలో పాల్గొంటున్నది అధిక శాతం నిరక్షరాష్యులేనని తెలిపారు.