దేశమంతా విద్యుత్ కొరత, కోతలున్నాయంటూ, ఏపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. బొగ్గు కొరత ఉందని.. కేంద్రం సరఫరా చేయడం లేదంటూ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది. జగన్ భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం ఏపీలో కృత్రిమ విద్యుత్ కొరత సృష్టించింది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు ప్రభుత్వం రూ.4,500 కోట్ల వరకు బకాయి పడింది. 2021 సెప్టెంబర్ 2న కేంద్ర ఇంధన శాఖ, రాష్ట్రానికి రాసిన లేఖలో బొగ్గు ఉత్పత్తి సంస్థలకు బకాయులు చెల్లించి, బొగ్గు నిల్వలు పెంచుకోవాలని చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ పై ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి. పవర్ ఫైనాన్స్ ద్వారా తెచ్చిన రూ. 25 వేల కోట్ల అప్పులో రూ. 6 వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించింది అని పేర్కొన్నారు.