బెజవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బెజవాడ టీడీపీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. బెజవాడలోని కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫొటోలను తొలగించారు. చంద్రబాబు ఫొటోలతో పాటుగా, టీడీపీ నేతల ఫొటోలను కూడా తొలగించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. నేతల ఫొటోల స్థానంలో రతన్ టాటా ఫొటోలను ఉంచారు సిబ్బంది. ఇక ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంపీగా మాత్రమే కొనసాగుతానని క్యాడర్‌కు తెలియజేశారు. 2024లో పోటీకి దూరంగా ఉంటానని నాని పార్టీకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. బెజవాడ టీడీపీలో వర్గపోరును అధిష్టానం సరిదిద్దకపోవడం వలనే కేశినేని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఫ్లెక్సీల మార్పుతో మళ్లీ కేశినేని అంశం తెరమీదకు వచ్చింది.
Read: కేరళలో భారీ వర్షాలు… విరిగిపడ్డ కొండచరియలు…