ఇవాళ జరిగిన భారత్ బంద్‌పై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… రైతుల కోసం జరిగిన బంద్‌లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక, వైసీపీ, టీడీపీ.. పార్లమెంట్లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగా నమోదు అవుతూ వస్తుండగా ఈరోజు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,069 శాంపిల్స్ పరీక్షించగా.. 618 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,178 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,81,32,713…
దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దీని పై గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదు అన్న ఆయన అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం జరగనుంది. ఆన్లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల సర్వే నిర్వహించాలని… విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్…
సినిమా పరిశ్రమ పవన్ కళ్యాణ్ సొంత సొత్తుకాదు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే చిరంజీవి కి ఉన్న హూందాతనం పవన్ కళ్యాణ్ కు లేదు అని తెలిపారు. సినిమా పోర్టల్ అన్ లైన్ వ్యవస్థ కు చిరంజీవి పూర్తి మద్దతు ఇస్తానన్నారు. యుద్ధానికి సిద్ధంకండి అంటూ కార్యకర్తలను పవన్ రెచ్చగొడుతున్నారు. తాలిబన్ తరహా పరిపాలన పవన్ కోరుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్పారు. జీఎస్టీ విధానంపై ప్రధానిని ప్రశ్నించి తర్వాత మా ప్రభుత్వ పనితీరును…
పొలిటికల్ సర్కిల్స్ లో ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి తెలియని వారుండరు. రాజకీయ వ్యూహకర్తగా పీకేకు మంచి పేరుంది. ఏ పార్టీకైనా ఆయన వ్యూహాకర్తగా పని చేస్తున్నారంటే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఆయన ఎంట్రీతోనే ఆపార్టీ సగం గెలిచినట్టే భావన కలుగుతుంది. దీంతో పీకేకు దేశంలో ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడింది. ఆయన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది. దీంతో పీకేను పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పెట్టుకునేందుకు ప్రాంతాలకు అతీతంగా ఆయా పార్టీలు ముందుకొస్తున్నాయి.…
గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని అలాగే… ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు నారా చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని… తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం…
అనంతపురం జిల్లాల్లో గుప్తనిథుల కోసం తవ్వకాలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. పాత ఆలయాలు, పాత గృహసముదాయాలు కనిపిస్తే చాలు మూడో కంటికి తెలియకుండా గుప్తనిథుల వేటగాళ్లు తవ్వకాలు జరుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని యాడికి మండలంలోని పుష్పాల-చింతలచెరువు ప్రాంతంలోని సుంకలమ్మ గుడికి సమీపంలో ఉన్నపాత బురుజు ప్రాంతంలోని పొలంలో రాత్రి సమయంలో తవ్వకాలు జరిపారు. అయితే, రాత్రి సమయంలో పొలం నుంచి వింత శబ్దాలు రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి చూసి షాక్…
ఏపీ సిఎం జగన్ కు జనసేన నేత పోతిన వెంకట మహేష్ లేఖ రాశారు. 2020 దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఆలయానికి తమరు హామీ ఇచ్చినట్టుగా 70 కోట్ల నిధులను తక్షణమే అమ్మవారి ఆలయానికి మళ్ళించాలని… ఇంతవరకు నిధులు రాలేదని ఈవో భ్రమరాంబ గారు లిఖితపూర్వకంగా తెలియజేశారని లేఖలో పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు స్టేట్ ఫెస్టివల్‌గా నిర్వహిస్తున్నారని.. 2019 & 2020 దసరా ఉత్సవాలకు సంబంధించిన నిధులను కూడా తమరు మంజూరు చేయలేదన్నారు. 2021 దసరా ఉత్సవాలు…
రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలొని అనేక ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా భారత గనులశాఖ గుర్తించింది. రాయగిరి సమీపంలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ కు గనులు ఉండేవి. అయితే, 2001 నుంచి గనుల తవ్వకాలను నిలిపివేశారు. అయితే, ఇప్పుడు ఈ గనులకు సమీపంలో మరో రెండు ప్రాంతాల్లో, రొద్దం మండలంలోని బొక్సంపల్లిలోని రెండు ప్రాంతాల్లో, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో 6 ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా గుర్తించారు. గనులు ఉన్నట్టుగా గుర్తించిన ప్రాంతాల్లో ఒక…
ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్పూర్-కళింగపట్నం వద్ధ తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్తరభాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతాకుతలం అయింది. ఆదివారం రోజున 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా…