ఇటీవల వచ్చిన గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోలేదు. తీరప్రాంతంలోని గ్రామాలు అనేకం ఇంకా ముంపులోనే ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. దీంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చేపల వేటకు వెళ్లే విషయమై మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ఈ గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోక ముందే…
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ మరోసారి సీరియస్ అయ్యారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని ఫైర్ అయ్యారు నారా లోకేష్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామసభలో సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకున్నా ఆమోదించాలంటూ ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదనే అక్కసుతో దళిత సర్పంచ్ మాచర్ల పై వైసీపీ నేతలు, వాలంటీర్ కలిసి దాడి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒళ్లు బలిసి దళితుల పై…
ఏపీలో డ్రగ్స్ సరఫరా లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లే ఉండకూడదన్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నాయ్.. అనే విషయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు జగన్. దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్రమ మద్యం, ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. అలాగే.. దిశ యాప్ అమలు పై…
పేరుకు ఆ రెండు జాతీయ పార్టీలు కానీ. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ రెండు పార్టీలు యేటికి ఎదురీదుతున్నాయి. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పోటీలో ఉన్నట్లే కన్పిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం వీటి ఉనికి అగమ్యగోచరంగా మారింది. కనీసం ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ రెండు పార్టీలు ఏవో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవేనండి కాంగ్రెస్, బీజేపీలు. ఈ రెండు పార్టీలే కేంద్రంలో అధికారం…
చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి 500 కోట్లకు పైగా విలువ కలిగిన భూములు కాజేసే ప్రయత్నం చేసారు. జిల్లాలోని 13 మండలాల్లో జరిగిన ఈ భూ కుంభకోణం జరిగింది. అయితే మొత్తం 93 సర్వే నెంబర్లలో ఉన్న 2,320ఎకరాల స్థలం పేర్ల మార్పు చేసారు. ఒకే రోజు ఆన్ లైన్ లో జరిగిపోయింది ఈ భూ దందా. ఈ కేసులో విఆర్వో మోహన్ పిళ్ళై ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆన్లైన్లో…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30, 515 శాంపిల్స్ పరీక్షించగా… 429 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 5 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,029 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,53, 192 కు…
కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఇరుపార్టీలు ఎవరికీ వారు తగ్గేదెలే అన్నట్లుగా మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిగా పైచేయి సాధించారనే టాక్ విన్పించింది. అయితే దీనికి సీఎం జగన్ మార్క్ కౌంటర్ త్వరలోనే పడబోతుందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పవన్ ఇష్యూకి సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సీఎం…
బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈరోజు లేదా రేపటిలోగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రావాలని పవన్‌ను కోరతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందని అన్నారు. పవన్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు…
బద్వేల్ నియోజక వర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు బరిలో ఉంటాయని అనుకున్నారు. వైసీపీ ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించింది. జనసేన, టీడీపీలు కూడా పోటీలో ఉంటాయని అనుకున్నారు. కానీ, సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మొదట జనసేన పార్టీ ప్రకటించింది. ఇదే బాటలో టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి మొదట డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని అనుకున్నారు. కాని, జనసేన నిర్ణయం…