ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్ల కలకలం రేగింది. అట్లూరులో 10 మంది మహిళలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. వారి వద్ద ఓటర్ స్లిప్పులు తప్ప ఆధార్ కార్డులు లేవని ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని ఓటు వేయనీయకుండా వెనక్కి పంపించారు. కాగా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Read Also: బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలు
మరోవైపు బద్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం సమయానికి పోలింగ్ శాతం పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగనుంది. కాగా బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.