టీడీపీ పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ విధానాలు.. చేపట్టాల్సిన ఆందోళనా కార్టక్రమాలపై చర్చ జరిపారు. రైతు, వ్యవసాయ సమస్యలపై నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న టీడీపీ నేతలు… విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖాపై ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతోందన్న చంద్రబాబు… ఏపీలోని డ్రగ్స్ మాఫియాపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని…
తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో తెలుగు అకాడమీ, కెనరా బ్యాంక్ సిబ్బంది సీసీఎస్ ఉన్నతాధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రఫిక్, రాజ్‌కుమార్‌ల సంబంధాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్ ల గల్లంతుపై ప్రశ్నిస్తున్నారు.. యూనియన్, కెనరా బ్యాంక్ ల నుండి 8 కోట్ల ప్రైవేట్ డిపాజిట్ లను మస్తాన్ వలి & గ్యాంగ్ కాజేసింది. ఒక్కఒక్కరిగా తెలుగు అకాడమీ సిబ్బందిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. రఫీ, రాజ్ కుమార్ లతో జరిపిన లావాదేవీలపై…
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే దూరంగా ఉండనున్నట్లు చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నట్టు పవన్ పేర్కొన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికకు దూరం ఉండనున్నట్లు టీడీపీ కూడా తాజాగా ప్రకటించింది. ఈరోజు పొలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ.…
బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేనను పోటీ చేయాలని కోరినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటామని జనసేన చెప్పింది అని వివరించిన ఆయన కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం… కాబట్టి బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అన్నారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరాం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందో లేదోననే అంశంపై ఆ పార్టీతో చర్చిస్తాం.…
కరోనా కేసులు రాష్ట్రంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 45,481 కరోనా పరీక్షలు చేయగా 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,52,763కి చేరింది. ఇందులో 20,28,202 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,357 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,204కి చేరింది.…
చిత్ర పరిశ్రమ వివాదంపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటో రజనీ మూవీ ఓపెనింగ్ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ… నలుగురు ప్రొడ్యూసర్లో, నలుగురు హీరోలనో దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోరని చెప్పిన కొడాలి నాని… పవన్ కళ్యాణ్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తుందన్నారు కొడాలి నాని. ఇష్టా రాజ్యంగా టికెట్ల ధరలు పెంచు కోవడాన్ని మేమ సమర్థించబోమని తెలిపారు. ఖచ్చితంగా అందరికీ…
ఈనెల 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీ తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్ధిని ప్రకటించారు. అయితే, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయమని ఒత్తిడి వచ్చిందని, చనిపోయిన…
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడును పెంచుతున్నారు. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ జనాల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా జనసేన ఇటీవల కొన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్నలను పొందే ప్రయత్నం చేస్తోంది. జనసేన తొలి విడుతగా తీసుకున్న రోడ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తుంది. ఇదే…
ఆంధ్రప్రదేశ్‌లో రోజూ వెయ్యికి పైగానే నమోదు అవుతున్న కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,304 శాంపిల్స్ పరీక్షించగా.. 865 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 9 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1,424 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,84,00,471 కరోనా నిర్ధారణ…