ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నిరసనలకు పిలుపు ఇవ్వగా.. అధికార పార్టీ వైసీపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. బీజేపీ తీరుపై ఏకంగా పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’ అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.100 దాటించి రూ.5, రూ.10 తగ్గించామని పెంచినోళ్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా? అని నిలదీసింది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. ఏపా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 215 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే తాజాగా ఒక్కరు మృతి చెందారు. ఇదే సమయంలో 406 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కారు. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,97,06,769 కు చేరగా.. మొత్తం పాజిటివ్…
పశ్చిమ మధ్య బంగాళా ఖాతం దగ్గరలో ని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం దగ్గర లోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది.ఇది సగటు సముద్ర మట్టము నకు 4 .5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్నభూమధ్య రేఖ వద్ద…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఆరోజు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. జడ్పీ లో ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా వైఎస్సార్సీపీ అవడం మాకెంతో ఘనత. వచ్చే పంట రబికి గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం కారణంగా ఆయకట్ట తగ్గుతుందని రైతుల్లో చర్చ జరుగుతుంది.…
తూర్పుగోదావరి : ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ పరిపాలన నిరంతరాయంగా దశాబ్దాలపాటు సాగాలని… అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం తలమానికంగా మారాలన్నారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే సి.ఎం. జగన్ అమలు చేశారని కొనియాడారు. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని… వరాలు ఇచ్చే దేవుడు వాడపల్లి వెంకటేశ్వరస్వామి అని…
వరుసగా పెరుగుతూ పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డులు సృష్టించాయి.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. కేంద్రం కోత విధించింది.. ఇక, కేంద్రం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో.. ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఒకటి కాగా.. పెట్రో ధరలపై పోరాటానికి సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.. ఇవాళ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన నివాసం మర్యాదపూర్వకంగా తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిశారు. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ ఛీఫ్ ఈ సందర్భంగా ఆహ్వనించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్ఎస్ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎం జగన్ కు వివరించారు…
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యిది.. పలువురు ఐఏఎస్ అధికారులు సహా ఉద్యోగులు సరిగా విధులకు హాజరు కావడం లేదని భావిస్తోన్న ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉంది.. ఏపీ సచివాలయంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించింది జీఏడీ.. ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై మరోసారి మెమో జారీ చేసింది.. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు…
మంచిరేవుల ఫామ్ హౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. సుమన్ రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. ఇవాళ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.. దీంతో.. గుత్తా సుమన్ ను మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు నార్సింగ్ పోలీసులు… మరోవైపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి.. ఇక, ఫామ్‌హౌస్…
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి.. దీంతో.. పెట్రోల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలు అడుగులు వేశాయి.. ఇప్పటికే దాదాపు ఎనిమిది రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి.. ఇందులో ఒడిశా మినహా మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే కావడం విశేషం.. అయితే, తెలుగు రాష్ట్రాలో అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోకపోగా.. తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా…