ఏపీలో గతంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలు కానున్నాయి. గురువారం అమావాస్య కావడంతో పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. దీంతో శుక్రవారం నాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమీక్షిస్తోంది. ప్రతి రెండుల గంటలకోసారి ఎస్ఈసీ అధికారులు నివేదిక తెప్పించుకుంటున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లోనే కాకుండా నామినేషన్ల పర్వంలోనూ అక్రమాలు…
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వార్ హీటు పెంచుతుంది.. మాజీ సీఎం, టీడీపీ అధినేత సొంతం నియోజకవర్గం కావడం.. వైసీపీ ఆ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో మున్సిపల్ వార్ హీట్ పెంచుతుంది.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది.. కుప్పంలోనూ అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని దీమాతో ఉంది.. దీంతో.. సొంతగడ్డపై చంద్రబాబుకి మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్లోకి…
ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం…
ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా లీటర్ పెట్రోల్ పై రూ.36, డీజిల్ పై రూ.25 చొప్పున పెంచిందన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.10 తగ్గించిందని, తెలంగాణతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10…
అమరావతి : పెట్రోల్ ధరలపై తగ్గించకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? అంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.12 తగ్గించాయని… అస్సోం,…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇంత హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దీపావళి పండుగ రోజు నామినేషన్లు వేయడమేంటని నిలదీశారు. దీపావళి పండగ కూడా జరుపుకోనివ్వకుండా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడం లేదని… దీపావళి పండగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే…
విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టుని క్రియేట్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీకి అంతర్జాతీయ సహకారం కోసం రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఏ. గీతేష్ శర్మను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జీఏడీ పరిధిలోకి ప్రత్యేక పోస్ట్ వస్తుందని చెప్పింది. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారి నియామకం చేపట్టింది. అన్ని దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కి సహకారం, అంతర్జాతీయ తెలుగు సంఘాలకి సహకారం అందించనున్నారు గీతేష్…
పెట్రోల్ ధరల విషయంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించడంతో గురువారం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అంతేకాకుండా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించినట్లు తెలుస్తోంది. Read Also: పెట్రోల్ రేట్లను మరింత…
వైసీపీ ఎమ్మెల్యే రోజా తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఆమె సంబరానికి ఓ బలమైన కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా గత ఏడాది పుష్ప అనే చిన్నారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. పుష్ప చదువు బాధ్యతలన్నీ స్వయంగా రోజా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో పుష్ప 89% మార్కులు సాధించింది. తనను ఆదరిస్తున్న రోజాకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. ఈ సంతోషాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా…