కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా? రెండుపార్టీల క్రెడిట్ ఫైట్‌తో రహదారి మలుపులు తిరుగుతోందా? రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తూ.. నరకం చూస్తున్న ప్రజల వాదనేంటి? లెట్స్ వాచ్..!
వైసీపీ, బీజేపీ మధ్య నిప్పు రాజేస్తున్న కోనసీమ రోడ్డు..!
Also Read
ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోకి ప్రవేశించే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి. గోతులు పడి.. పూర్తిగా పాడవడంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటే కోనసీమ వాసులు నరకం చూస్తున్నారు. అయితే రావులపాలెం పదహారో జాతీయ రహదారి నుంచి అమలాపురం 226 హైవేని కలుపుతూ కొత్త రోడ్డును కోనసీమకు మంజూరు చేసింది కేంద్రం. ఏపీ బీజేపీ నేతలు… ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా నాయకులు చెప్పినట్టుగా రహదారి నిర్మాణం జరగాలని ట్వీట్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అంతే అక్కడ నుంచి అధికార వైసీపీ.. బీజేపీ నేతల మధ్య ఈ రోడ్డు నిప్పు రాజేసింది.
మందపల్లి మీదుగా రోడ్డును ప్రతిపాదిస్తున్న బీజేపీ నేతలు..!
రావులపాడు నుంచి పలివెల మీదుగా రోడ్డు కోరుతున్న వైసీపీ నేతలు..!
రాజకీయ విభేదాలతో కొత్త రోడ్డు నిర్మాణం ముందుకెళ్లడం లేదు. అయినప్పటికీ రహదారి మంజూరుకు కారణం తామంటే తామని వైసీపీ, బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారు. ఈ గొడవతో కొత్త వివాదం తెరపైకి వచ్చి… మరిన్ని చిక్కుముళ్లు పడ్డాయి. రావులపాలెం నుంచి మందపల్లి మీదుగా కొత్తపేట నుంచి అమలాపురం వరకు ప్రస్తుతం ఉన్న మార్గంలోనే కొత్త రోడ్డు వేయాలని కోనసీమ బీజేపీ నేతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ద్వారా కేంద్రమంత్రికి ఓ వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ నేతలు ససేమిరా అంటున్నారట. రావులపాడు నుంచి వయా పలివెల మీదుగా అమలాపురం ప్రధాన కాల్వ పక్కగా కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలన్నది వైసీపీ నేతల డిమాండ్.
స్థల సేకరణకు పొలాలు అడ్డంకిగా మారతాయా?
వైసీపీ, బీజేపీలు రెండు వేర్వేరు మార్గాలను నిర్దేశించడంతో ఏ రూటుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నది క్లారిటీ లేదు. రావులపాడు నుంచి పలివెలకు 10 కిలోమీటర్లు ఉంటే.. రావులపాలెం నుంచి కూడా అంతే దూరం ఉంది. కాకపోతే రహదారి నిర్మాణానికి స్థల సేకరణకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. రావులపాడు నుంచి రోడ్డు నేరుగా ఉండటంతో స్థల సేకరణకు పొలాలు అడ్డంకి అవుతాయి. అదే రావులపాలెం నుంచి అయితే కొన్ని గ్రామాల్లో భవనాలు తొలగించాల్సి వస్తుంది. దాంతో సమస్యలు పెరుగుతాయనే వాదన ఉంది.
రావులపాడును బైపాస్ రోడ్డుగా మారిస్తే బెటర్?
రావులపాలెం రోడ్డే అందరికీ అనువైనదని.. దానిని విస్తరిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటే.. బైపాస్ రోడ్డుగా రావులపాడు రహదారిని ఎంచుకుంటే బెటర్ అన్నది మరికొందరి వాదన. కానీ.. సమస్య ఎక్కడా తెగడం లేదు. రెండు పార్టీల మధ్య విమర్శలకు ముడి సరుకుగా మారిపోయింది. మరి.. ఈ రోడ్డెక్కిన రాజకీయానికి ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి.
తాజావార్తలు
-
Bonda Uma: నా కుమారుడికి మేయర్ సీటు అడిగిన మాట వాస్తవమే.. వంగవీటి ఎంట్రీతో..! బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..
-
Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
-
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!