విజయవాడలో హైలైఫ్ బ్రైడ్స్ అతిపెద్ద వివాహ, ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. విజయవాడలో మొట్టమొదటిసారిగా హైలైఫ్ బ్రైడ్స్ ప్రదర్శన నిన్న నోవొటెల్ విజయవాడ వరుణ్ వద్ద ప్రారంభమైంది. అయితే ఈ ప్రదర్శన 26,27 నవంబర్ 2021న.. అంటే ఈరోజు రేపు కూడా ఉంటుంది.
• అయితే నోవొటెల్ , వరుణ్ వద్ద ఏర్పాటుచేసిన హై లైఫ్ బ్రైడ్స్ ప్రదర్శనలో… నటులు ఐశ్వర్య ఉల్లింగాల, యష్న చౌదరి, రితికా చక్రవర్తి తో పాటుగా అగ్రశ్రేణి మోడల్స్, ఫ్యాషన్ ప్రియులు పాల్గొన్నారు.
• హైలైఫ్ బ్రైడ్స్ లో వధువుల ఫ్యాషన్‌లకు సంబంధించి అతి పెద్ద బ్రాండ్లు పాల్గొనడంతో పాటుగా బ్రైడల్ డ్రెసెస్, వెడ్డింగ్ జ్యువెలరీ, వెడ్డింగ్ శారీస్, వెడ్డింగ్ అవసరాలు, ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, డిజైనర్ అప్పెరల్, యాక్ససరీలు వంటివిప్రదర్శించనున్నారు.
అయితే వధువులు ఎప్పుడూ కూడా తమ వివాహం రోజున మహరాణుల్లా వెలిగిపోవాలని కలలుకంటారు. దీని కోసం అవసరమైన ఫ్యాషన్ వస్త్రాలు, ఆభరణాల కోసం ఎంతో సమయమూ వెచ్చిస్తుంటారు. నవ వధువుల ఈ కష్టాలను తొలగించడంతో పాటుగా వారికి అవసరమైన ఫ్యాషన్‌లన్నీ ఒకే చోటకు తీసుకువస్తుంది హై లైఫ్ బ్రైడ్. సౌకర్యవంతమైన షాపింగ్‌ను అంతే సౌకర్యంగా, ఫ్యాషనబల్‌గా అందిస్తూనే అత్యాధునిక ధోరణులు, డిజైనర్ వస్త్రాభరణాలు, యాక్ససరీలు వంటివి సైతం అందిస్తున్నది హైలైఫ్ బ్రైడ్. దేశంలో అమిత ఆదరణ పొందిన ఎగ్జిబిషన్ బ్రాండ్ హైలైఫ్. ఈ బ్రాండ్ మొట్టమొదటిసారిగా విజయవాడలో తమ హైలైఫ్ బ్రైడ్స్ ప్రదర్శనను నోవొటెల్ వరుణ్, విజయవాడ వద్ద చేస్తుంది.
ఈ సందర్భంగా హైలైఫ్ ఎగ్జిబిషన్స్ ఎండీ అండ్ సీఈవో శ్రీ అభయ్ పీ డొమినిక్ మాట్లాడుతూ… ‘‘ దేశంలో అతిపెద్ద బ్రైడల్ మరియు వెడ్డింగ్ నేపథ్యం కలిగిన ఎగ్జిబిషన్ బ్రాండ్‌లలో హైలైఫ్ బ్రైడ్స్ ఒకటి. వివాహ మరియు వధువుకు అవసరాలను ఒకే చోట అందిస్తూనే ఫ్యాషన్ మరియు జీవనశైలి ఉత్పత్తులు సైతం ప్రదర్శిస్తుంది. సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు తో పాటుగా ఫ్యాషన్ లేబుల్స్ తమ కలెక్షన్‌ను ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి’’ అని అన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను పూర్తిగా అనుసరిస్తూ నిర్వహిస్తున్న హై లైఫ్ బ్రైడ్స్ ప్రదర్శన జరుగనుంది.






