తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాల విడుదలకానుంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రం ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు. కొఠియా గ్రామాలతోపాటు, నేరడి బ్యారేజీపై చర్చించనున్నారు. శ్రీకాకుళం, ఒడిశాలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరతారు. సాయంత్రం 5…
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో మద్యం తాగడంపై నిషేధం విధించారు. ఈ మేరకు గ్రామ కమిటీ పేరుతో గ్రామంలో హెచ్చరిక బోర్డులు వెలిశాయి. కొందరు వ్యక్తులు మద్యం తాగిన మత్తులో సీసాలు పగలకొట్టడం, మద్యం బాటిళ్లను పొలాల్లో, రోడ్లపైనే పడేస్తుండటంతో విసుగు చెందిన గ్రామ పెద్దలు మద్య నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. Read Also: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా తమ గ్రామ పరిధిలో పొలాలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో…
మౌలిక వసతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ర్యాంకులు దిగజారాయి.. గతంలో ఉన్న ర్యాంకులు నిలబెట్టుకోకపోగా.. రెండు రాష్ట్రాలు తమ ర్యాంకులను కోల్పోయి.. కిందికి దిగజారాయి.. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్”ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.. ఈ సారి గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.. అయితే, 2019లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారిపోయింది.. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా, 2021…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ…
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే కనీసం రూ.50 అవుతుంది. సరే ఇంట్లో వండుకుందామని అనుకున్నా ఒక్కొక్కరికి కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుంది. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో బ్రేక్‌ఫాస్ట్ నుంచి భోజనం వరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఆ హోటల్లో ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నా రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. దోశ, ఇడ్లీ, పూరీ, వడ, ఉగ్గాని ఇలా ఏది తీసుకున్నా…
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టమునకు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒక అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉంది ,తరవాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్ 11, 2021 ఉదయం నాటికి చేరుకుంటుంది. పశ్చిమ మధ్య మరియు దానిని…
ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఇద్దరు సహాయమంత్రులను కూడా బుగ్గన కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉందని.. లండన్‌లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగిందని… ఇప్పుడు రెండో దఫా జరగాల్సి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి వీటిలో జాప్యం జరుగుతోందని బుగ్గన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. Read Also: వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ…
జాతీయ ప్రాజెక్టైన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగుకు వెళ్లిన ప్రభుత్వం.. సెకీ ఒప్పందం విషయంలో రివర్స్ టెండరింగుకు ఎందుకు వెళ్లడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కాయి.. అయినా రివర్స్ టెండరింగుకు వెళ్లిన విషయం ప్రభుత్వం మరిచిందా అని మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. సెకీ నుంచి రూ. 1.99కే విద్యుత్ లభిస్తోంటే.. రూ. 2.49కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారోననే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సోలార్ పవర్ కొనుగోళ్ల…