జల వివాదాల విషయంలో లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది.. కృష్ణా నది యాజమాన్య బోర్డుకే కాదు.. గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి కూడా లేఖలు రాస్తున్నారు.. తాజాగా, జీఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళిధర్.. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారమే పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ 26.10.2021న లేఖ రాశామని.. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం)…
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు.. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు…
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలి.. వ్యాపారం చెయ్యకూడదన్నది ప్రధాని నరేంద్ర మోడీ పాలసీగా చెప్పుకొచ్చారు.. అందుకే విశాఖ…
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది. వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలను నమోదు చేసి ఘన విజయం సాధించింది. 90,411 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలుపొందారు.. అయితే, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 21 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మకు 6 వేల పైచిలుకు ఓట్లు…
ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోంది. అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్ల పాలు కానుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆఖరికి గవర్నరును కూడా ఈ ప్రభుత్వం తమస్వార్థానికి బలి చేసింది. గవర్నర్ అధికారులను పిలిచి, తన పేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చింది. గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా, ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవు అన్నారు.…
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. Read Also: వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఇదేనా? అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల…
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్.. అందరూ హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారంటూ మండిపడ్డారు.. ప్రజలు వీళ్లను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారని కామెంట్ చేసిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఓటు మాత్రం పులివెందులలో ఉందని గుర్తుచేశారు. ఇక, బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని సెటైర్లు వేశారు.. ఈ పాదయాత్ర…
దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధకి రైతులే వెన్నెముక.. జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారు. భూగర్జ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నీరు చెట్టుకి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే.. రైతు ఆత్మహత్యలో 3 వస్ధానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 వస్ధానం అని…
విజయవాడ బెంజ్ సర్కిల్ కొత్త ఫ్లై ఓవరును ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ… విజయవాడ వాసుల దశాబ్దాల ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుండటం సంతోషంగా ఉంది. గడ్కరీ విజయవాడ నగరానికి ఏది అడిగినా కాదనకుండా చేశారు అని తెలిపారు. చంద్రబాబు విజన్, గడ్కరీ సహకారంతో రికార్డు కాలంలో రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి అన్నారు. రెండో ఫ్లైఓవరును అనుకున్న సమయానికి 6 నెలల…
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను వీరు ఆవిష్కరించారు. దీంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీరితో పాటు ఈ కార్యక్రమానికి ర్యాలీగా వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్లో జగన్ ఆటం బాంబులు టీడీపీ ర్యాలీ సందర్భంగా…