టీటీడీలో జరుగుతోన్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీటీడీలోని 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుకు జనసేనా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఎందుకు విస్మరించారు అంటూ ఫైర్ అయ్యారు.. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనసేనాని.. 2010లో టీటీడీ సూచనల మేరకే 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు.. మరి కొత్తగా ఇప్పుడు…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో…
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు(35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు. వీరు నలుగురు కలిసి…
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పైన కొంత పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే తిరుపతి, శ్రీకాలహస్తి కి భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేసారు. అక్కడ పాత భవానాల్లో, ఇళ్లలో ఎవరు నివాసం ఉండద్దు అని అధికారులు ప్రజలకు సూచించారు. వెస్ట్,డిఆర్ మహల్ అండర్ బ్రిడ్జ్‌ల వద్ద వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు అమర్చారు. అయితే ఈ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,768 శాంపిల్స్ పరీక్షించగా.. 320 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 5 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 425 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,97,45,537 కు పెరగగా… మొత్తం…
మీరు మారిపోయార్సార్ అంటున్నారు తమ్ముళ్లు..అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట.అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా? అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే గగనంగాడే పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట. ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో…
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి లేవనెత్తారు. ఇదే అంశంపై ఇటీవల ఆయన విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా.. ఈరోజు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, పోలీస్ కాల్పుల్లో అమరులైన వారి పేర్లను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమం సమయంలో ఏం జరిగిందో ఆనాటి కొన్ని దినపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్‌ను కూడా పవన్ షేర్ చేశారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన…
రెండు తెలుగు రాష్ట్రాలకు మరో సారి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం కొనసాగుతోంది. 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏపీలోనూ రానున్న 24…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఉమాశంకర్‌రెడ్డి వివేకా పీఏగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు. ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా… అందులో కీలక విషయాలను వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పరుగులు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని బ్రిడ్జి…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం. Read Also:…