టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతుల ధర్నా కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఆంధ్రా సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని చురకలు అంటించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. బీజేపీ లఫంగా, బట్టెబాజ్ గాళ్ళ కు ధర్నా చేయాలని ఎలా అనిపించిందని బీజేపీ నాయకులపై కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ప్రశాంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్…
ఆంధ్రప్రదేశ్ అప్పులపాలు అయ్యింది.. ప్రతీ ఫ్యామిలీపై అప్పుభారం పడుతోంది.. అన్నింటికీ వైఎస్ జగన్ సర్కార్ అప్పులు చేస్తుందంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది ప్రతిపక్ష టీడీపీ.. అయితే, పుట్టబోయే బిడ్డపైనా కూడా వైఎస్ జగన్ అప్పు ఉందంటూ మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు.. రెండున్నరేళ్లలో చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లుగా గణాంకాలు చెప్పిన ఆయన.. ఈ లెక్కన ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం పడుతుందన్నారు.. సీఎం జగన్ రెండున్నరేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్…
మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరం.. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలో సిగరెట్ కాల్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మన ఏపీకి చెందిన వ్యక్తే. కువైట్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉండగా… అందులో ఏపీకి చెందిన మహ్మద్ షరీఫ్ (57) ఉన్నాడు. అతడు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి తన లో దుస్తుల్లో దాచుకున్న సిగరెట్లను విమానంలోకి తీసుకువచ్చాడు. Read Also: జపాన్ కు చేరిన…
ఏపీ సీఎం జగన్ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఉదయం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా సెప్టెంబర్ 24వ తేదీన సీఎం జగన్ వ్యాయామం చేస్తూ గాయపడ్డారు. జిమ్ చేస్తుండగా ఆయన కాలు బెనకడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో వైద్యులు సాధారణ ట్రీట్మెంట్ ఇవ్వగా…
కుప్పం పర్యటనలో నారా లోకేష్ వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని… అడ్డగోలుగా తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని ఫైర్ అయ్యారు.ఖాకీలు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా… ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తమ నాన్న చంద్రబాబు కాస్త సాఫ్ట్ అని.. కానీ తాను…
దేశవ్యాప్తంగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీకి విరాళాల రూపంలో రూ.89 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ.81 కోట్లు వచ్చాయి. అటు ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి విరాళాల రూపంలో రూ.74 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా…
తమిళనాడుకు ఒక వరుణగండం తీరింది.. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. లాండ్ ఫాల్ తర్వాత వాయుగుండం తీవ్ర తగ్గుతుందని వాతావరణశాఖ చెబుతోంది. అయితే, శుక్రవారం కూడా తమిళనాడు వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, తీరం దాటిన తర్వాత ఊడా కొన్ని గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ఇటు తూర్పు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. బలమైన ఈదురు గాలులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి.. ఏపీలోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు… అత్యవసరమైతే…
ఏదైనా గొడవ జరిగితే పోలీసులకు చెబుతా.. కేసు పెడతా అంటారు కొందరు. దీంతో ఎదుటి పక్షం భయపడుతుందనేది వాళ్ల అభిప్రాయం. ఆ నియోజకవర్గంలోనూ అంతే..! కాకపోతే ఖాకీల పేరు చెప్పి కాసులు వెనకేసుకుంటున్నారట అధికారపార్టీ నేతలు. వర్గపోరు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నారు. పోలీసుల పేరుతో పార్టీ నేతల వసూళ్లు? కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. ఇదే నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి. ఎవరి వర్గం వారిదే. మొదటి నుంచి అస్సలు పడటం…
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచె త్తుతుంది. నేడు తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలె వరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుఫాన్ కొద్ది సేపట్లో తమిళ నాడులోని కరైకల్, ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న కడలూరులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.…