దూసుకొస్తున్న ‘జవాద్’.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురిసిన వర్షాల ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు.. అప్పుడే మరో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది… ‘జవాద్’గా నామకరణం చేసిన ఈ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు ఏర్పాటు చేయాలని సూచించిన ఏపీ సీఎం.. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు.. ఇక, తుఫాన్ వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: కేసీఆర్, జగన్‌కు ముద్రగడ లేఖ..
Also Read
మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు సీఎం జగన్.. శ్రీకాకుళం జిల్లాకు హెచ్. అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించిన ఆయన.. తక్షణమే సంబంధిత జిల్లాలకు చేరుకుని సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు చూడాలని పేర్కొన్నారు. అయితే, అండమాన్ సముద్రం పరిసరాల్లోకి ప్రవేశించిన అల్పపీడనం.. పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా మారనుందని ఆ తర్వాత తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని.. శుక్రవారం తుఫాన్‌గా మారుతుందని.. శనివారం ఉదయం తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!