ఏపీలో ప్రస్తుతం రాజకీయం సినిమా చుట్టూ తిరుగుతుంది అనేది అందరికి అర్ధం అవుతుంది. అక్కడ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లు, ప్రదర్శన షో లపై తీసుకున్న నిర్ణయాలు చర్చముషానియంగా మారాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇక మీదట బెన్ విత్ షో లు వేయకూడదు అని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశం మధ్య అక్కడ ఈరోజు అఖండ సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అని చుసిన వాళ్ళు చాలా మంది అంటున్నారు. ఇదిలా ఉంటె… కృష్ణా జిల్లా మైలవరం లో ఈరోజు అఖండ సినిమా ఉదయం 8:00 గంటలకు బెన్ ఫిట్ షో ప్రదర్శించారని సంఘమిత్ర మిని థియేటర్ ను సీజ్ చేసారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బెన్ ఫిట్ షో కు అనుమతి లేదు అని తెలిపారు అధికారులు.అయితే ఆ థియేటర్ లో ఇప్పటికే నాలుగు షోలకు టికెట్స్ బుక్ చేసుకున్నారు అభిమానులు. ఇక నిబంధనల ప్రకారం ఒకరోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శిస్తున్నారని థియేటర్ మేనేజర్ తెలిపారు.