స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. ఆయన పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. ఇవాళే విచారణ చేపట్టే అవకాశం ఉంది… కాగా.. తన నివాసంలో ఏపీ సీఐడీ సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. 13వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు… అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లక్ష్మీ నారాయణ.. అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.. ఈ నెల 10వ తేదీన సీఐడీ తనిఖీల సందర్భంగా ఇంట్లో స్పృహ తప్పి పడిపోయాడు.. అధిక రక్తపోటుతో హాస్పిటల్‌కు తరలించారు.. ఈ రోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.. ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్న ఆయన.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.