ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే కర్నూలు మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులపై దాడిపై ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు చేసారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బేతాలలో కేఈ ప్రభాకర్, కోట్ల సుజాత, గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి, తిక్కా రెడ్డి ఉన్నారు. అయితే టీడీపీ నేత తిక్కారెడ్డి పై మూడు సార్లు దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అక్రమాలను అరాచకాలను అడ్డుకుంటున్నందుకే తమ పై దాడి చేస్తున్నారు అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. తిక్కారెడ్డిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం జరుగుతోంది టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే దాడికి పాల్పడుతున్న వ్యక్తులను త్వరగా అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.