చంద్రబాబుకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహారిస్తే కనీస గౌరవం దక్కుతుంది అని సూచించారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే జగన్ 4 అడుగులు ముందుకు వేస్తున్నారు. కానీ జగన్ పాలనపై ప్రతిపక్షాలకు పిచ్చి ఎక్కి విమర్శలు చేస్తున్నాయి అని తెలిపారు. ఓటీఎస్ పేద ప్రజలకు ఓ వరం అని చెప్పిన రోజా… చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా 14 మందికి ఇళ్లపై హక్కు కల్పించ లేకపోయారు అన్నారు. రిజిస్ట్రేషన్ తో పాటు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అమలు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి అని వివరించారు. డబ్బులు కట్టవద్దని అంటున్నారే తప్ప ఓటీఎస్ ను ఎవరు వ్యతిరేకించడంలేదు అని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా.