ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 21010 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 108 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందరు. ఇదే సమయంలో 141 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.
ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,98,406 కు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2074976 కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 2058631 కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1878 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,467 కు పెరిగింది.