తిరుపతిలో కొందరు దుండగులు ఏటీఎంల ట్యాంపరింగ్లకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో ట్యాంపరింగ్ చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్బీఐ ఏటీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని ఈనెల 2న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల…
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Read Also: ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్…
✍ తెలంగాణలో నేడు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్✍ ఢిల్లీ: నేడు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు… నేడు ప్రజల సందర్శనార్థం రావత్ దంపతుల భౌతిక కాయాలు.. ఉ.11 గంటల నుంచి ప్రజలు, ప్రముఖుల సందర్శనకు అనుమతి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి భౌతికకాయాల సందర్శనకు సైనికాధికారులకు అనుమతి✍ ఏపీలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు… పీపీపీ విధానంలో విశాఖ, అనంతపురంలో ఏర్పాటు.. నేడు…
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి సంగం వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మంది వాగు ఉధృతికి కొట్టుకుపోయారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వాగులో భారీ వరదలో పలువురు ప్రయాణికులు కొట్టుకుపోతుండగా.. ఏడుగురిని స్థానికులు…
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల…
పార్లమెంట్ శీతాకాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు.. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,101 శాంపిల్స్ పరీక్షించగా.. 193 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 3 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,06,82,613 కు…
మనదేశంలో ఎన్నో వింత సంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాలను పూర్వకాలం నుంచి యథాతధంగా పాటిస్తూ వస్తుంటారు. అలాంటి వాటిల్లో జరుడుకాలనీ గ్రామదేవత జాతర ఉత్సవం ఒకటి. ఈ ఉత్సవాన్ని 10 రోజులపాటు నిర్వహిస్తారు. సీతంపేట మండలంలోని జరుడుకాలనీ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి గ్రామదేవతకు పూజలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వ తేదీ వరకు మొత్తం 10 రోజులపాటు ఈ జాతరను…
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. అయితే వర్చువల్ పద్ధతిలో సాగిన సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఖరీఫ్ సాగు ఎండింగ్ కోసం నీటి కేటాయింపుల కోసం సమావేశం నిర్వహించారు. 15 రోజులలో ముగిసే ఖరీఫ్ పంట కోసం కాకుండా రాబోయే యాసంగి సీజన్ కోసం చర్చించాలన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు ప్రతిపాదనకు ఓకే చెప్పింది ఏపీ. త్వరలో పూర్తి స్థాయిలో నిర్వహించే మీటింగ్ కు హాజరవుతామన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి.…
త్వరలో ఏపీకి విశాఖ నగరం ఏకైక రాజధాని అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఉగాదికి ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే ఆలోపు విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జగన్ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. విశాఖ నగరంలో స్నో పార్క్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. విశాఖలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ…