రోజురోజుకీ అవినీతి పెరిగిపోతూనే ఉంది.. ఏ పని కావాలన్నా మొదట కొంత సమర్పించుకుంటే గానీ పని కాని పరిస్థితి.. ఏ కార్యాలయానికి వెళ్లినా.. అధికారికో.. లేదా మధ్యవర్తికో కొంతైనా ముట్టచెప్పకపోతే.. ఆ ఫైల్ కదలడంలేదంటే అతిశయోక్తి కాదు.. అయితే, ఎప్పటికప్పుడు అవినీతి అధికారులు, ఉద్యోగుల ఆటకట్టిస్తూనే ఉంది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఈ ఏడాది ముగిస్తున్న నేపథ్యంలో.. 2021 సంవత్సరంలో అవినీతికి సంబంధించిన కేసులపై నివేదిక విడుదల చేసింది ఏసీబీ… ఏసీబీ నివేదిక ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిలో రెవెన్యూ శాఖ.. లంచాలు డిమాండ్ చేసి తీసుకుంటూ చిక్కిన కేసులు అధికంగా రెవెన్యూ శాఖలోనే 36 ఉన్నట్టు నివేదికలో పేర్కొంది ఏసీబీ.. ఇక, తర్వాత రెండు స్థానాల్లో ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో 8 కేసులు, ఆర్ అండ్ బీ శాఖలో 7 ట్రాప్ కేసులు ఉన్నాయని.. హోమ్ శాఖలో 6, మున్సిపల్ శాఖలో 5 కేసులు నమోదు అయినట్టు ఏసీబీ 2021 నివేదికలో పేర్కొంది.
Read Also: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోడ్లు కూడా మూత-సీపీ