సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ వాళ్లు పరిశ్రమలో ఉన్నారు కాబట్టే సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్ ఇస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు. సినిమా టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేదల కోసమే తమ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను తగ్గించిందన్నారు. సినీ హీరోలు కోట్లు ఆర్జిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని.. పేదలు వినోదం కోసం సినిమాకు వెళ్తే రూ.వెయ్యి,…
కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే వెనుకవైపు ఉన్న ధ్వజస్థంబం నుంచి లోపలికి వచ్చిన చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్నకుక్కపిల్లలను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. చిరుతను గమనించిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో బెదిరిపోయిన ఆ చిరుత అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎగువ అహోబిలం ఆలయంలోని రామానుజాచార్యుల మండపం వద్ద కుక్కపిల్లలు ఉన్నాయని ఎలా పసిగట్టిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే, రెండు మూడు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కర్నూలోని మెడికల్ కాలేజీలో 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. మొత్తం 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఎంబీబీఎస్ ఫస్టీయర్ చదువుతున్న 11 మంది విద్యార్థులకు, నలుగురు హౌస్ సర్జన్లకు కరోనా సోకింది. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి…
మరోసారి ఏపీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి నిరసనగా నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు పార్టీ కండువాలు వేసుకున్నారని మండిపడ్డారు.. వ్యవస్ధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో వుండిపోయింది.. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని.. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని…
1) భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు… ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్‌లో కొత్తగా 1,59,632 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 327 మంది కరోనాతో మృతి చెందారు. అటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 3,623కి చేరింది. 2) ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన షాక్‌తోనే ఈరోజు చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నాడన్నారు.…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలడుగు ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముఠాను పట్టుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరులో మేడికొండూరు పీఎస్ పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లికి చెందిన ఓ జంటపై 8 మంది ముఠా సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో భర్తను కొట్టి అతడి ముందే భార్యను సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా…
ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొంత ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నకల మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు సభలు, సమావేశాలు, రాజకీయా నేతల పర్యటనలతో హీట్ పెంచుతున్నారు.. కోవిడ్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గినా.. స్టేట్మెంట్లు, ఆరోపణలు, విమర్శలతో మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నారు.. అయితే, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ముందస్తూ…
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు…
★ నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం★ ఏపీ: కరోనా దృష్ట్యా నేడు మంగళగిరిలో జరగాల్సిన జనసేన కార్యవర్గ సమావేశం వాయిదా★ అమరావతి: నేడు జరగాల్సిన ఉద్యోగ జేఏసీ సమావేశం వాయిదా… తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసిన ఉద్యోగ జేఏసీ★ హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ★ నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం: వాతావరణశాఖ★ హైదరాబాద్: నేడు హీరో కృష్ణ…