కేసీఆర్‌పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్.. ఈ మధ్య రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ తాడేపల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్లను అంతలా కలచివేచేలా చేస్తోందో? అని అనుమానాన్ని వ్యక్తం చేశారు.. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయన్న ఆయన.. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారు? అని ప్రశ్నించారు.. మరోవైపు.. పీఆర్సీ ఆందోళనలపై స్పందించిన మంత్రి సురేష్.. పీఆర్సీకి సంబంధించి ఒక మెలిక పడింది.. ముఖ్యమంత్రి పై మాకు నమ్మకం ఉంది.. చర్చలకు వెళ్లటంలో తప్పు లేదని మీరు కూడా చెప్పండి అని సూచించారు.
Read Also: నేను అప్పుడే జగన్ పాదాలకు దండం పెట్టా- డిప్యూటీ సీఎం
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!