ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నైట్ కర్ఫ్యూ విధించాలని సోమవారం సీఎం జగన్ ఆదేశించగా… అందుకు సంబంధించిన జీవోను మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం ఏపీలో ఈనెల 31 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే కరోనా ఆంక్షలు కూడా రాష్ట్రంలో అమలులో ఉంటాయని తెలిపింది.…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఓ దశలో ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా మారింది.. అయితే, ఈ వ్యవహారం మరింత రచ్చగా మారకుండా సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ప్రభుత్వంలో చర్చలు జరపడం.. ప్రభుత్వం కమిటీ వేయడం.. ఆ కమిటీ వరుసగా సమావేశాలు అవుతూ.. వివిధ సమస్యలపై చర్చించడం జరుగుతోంది.. మరోవైపు.. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగానే మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని సందర్భాల్లో మైక్…
గత కొంతకాలంగా మళ్లీ కరోనా పంజా విసురుతోంది.. అన్ని రాష్ట్రాలు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత నుంచి అంటే ఈ నెల 17వ తేదీ నుంచి వర్చువల్ విధానంలోనే…
సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చ హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.. రాంగోపాల్ వర్మను పిలిచి భోజనం పెట్టారు.. కానీ, విద్యార్ధుల కడుపు నింపే విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు అని మండిపడ్డారు.. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం…
ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు పేదవాళ్లకు ఇప్పటికే పంపిణీ చేశామని గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఎంఐజీ వెబ్ సైట్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.. మధ్య తరగతి కుటుంబాలకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్ కంటే తక్కువకే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.. ప్రభుత్వమే అభివృద్ధి చేసి, ప్లాట్లను ఇస్తుంది..…
ఏపీ సీఎం జగన్‌కు టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ లేఖ రాశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని… అందులో భాగంగా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించిందని నట్టి కుమార్ లేఖలో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినా పండగ సీజన్లో సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు ఉంటాయి కాబట్టి 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్మాతలు, సినిమా థియేటర్ల యజమానులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. అందువల్ల…
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగు వైపు వెళ్లిన పిల్లలు రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన వారిని చరణ్, బాలయేసు, అజయ్, రాకేష్, సన్నీగా పోలీసులు వెల్లడించారు. నది ఒడ్డున విద్యార్థుల బట్టలను వారు స్వాధీనం చేసుకున్నారు. Read Also: పంచెకట్టి వేషం మార్చారు.. ఏసీబీ దెబ్బకు హడల్…
ఏపీ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. ఏపీలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యలు ప్రభుత్వానికి కనిపించడంలేదా అని పయ్యావుల కేశవ్ నిలదీశారు. ఏ సమస్య లేదు అన్న తరహాలో సినిమా టిక్కెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని సూటిగా ప్రశ్నించారు. Read Also: చట్టప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు: మంత్రి పేర్ని…
టాలీవుడ్లో నెలకొన్ని సినిమా టిక్కెట్ ధరలపై మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1955 సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 1955 నుంచి అదే జరుగుతోందని… తాము కొత్తగా సృష్టించిందేమీ లేదన్నారు. రామ్‌గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారని.. అన్నీ వివరంగా విన్నానని తెలిపారు.…
ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో సీఎం జగన్ ఆత్మకూరు వచ్చి చూడాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హితవు పలికారు. ఆత్మకూరులో పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌లను పక్కన కూర్చోబెట్టుకుని పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలు ఆత్మకూరుకు, అంజాద్ బాషాకు…