చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని.. అలాంటి రోడ్డుకు టోల్ ఛార్జీ వసూలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుకు టోల్ వసూలు చేయవద్దని ఎమ్మెల్యే రోజా వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి-చెన్నై రహదారి పూర్తిగా దెబ్బతిందని, వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు. Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు జాతీయ…
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే… జగన్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఓటీఎస్లాగా జగన్కు ప్రజలు వన్ టైం పాలనను అందించారన్నారు. వైసీపీ వాళ్లు కొత్త బిచ్చగాళ్లు అని.. వాళ్లకు చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. పొత్తులపై వైసీపీ నేతలవి పనికిమాలిన వ్యాఖ్యలు అని ఆరోపించారు. తాము గతంలో పొత్తులతో గెలిచామని.. పొత్తులు లేకుండా కూడా…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు అని ఎద్దేవా చేసిన ఆయన.. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్దుడు అని వ్యాఖ్యానించారు.. గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా లవ్ చేశారని.. చంద్రబాబు అవకాశవాది.. అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పలేను అని హాట్ కామెంట్లు చేశారు. ఇక, జనసేన పార్టీ మా మిత్రపక్షం…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291, కేరళలో 284, గుజరాత్లో 204, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114 కేసులు, తెలంగాణలో 107 కేసులు, ఒడిశాలో 60 కేసులు, ఉత్తరప్రదేశ్లో 31 కేసులు, ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 1,199…
కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పోలీస్ శాఖ శుక్రవారం నుంచి కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేయబోతోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ధరించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా…
స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్లో భాగంగా జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేటగిరిలలో ఐదు గోల్డ్, ఐదు సిల్వర్ స్కోచ్ అవార్డులు దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు. Read Also: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక కాగా ఏపీ ప్రభుత్వం…
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది.. ఉద్యోగాల కోసం, బతుకుదెరువు కోసం కన్నఊరిని విడిచి ఇతర పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలకు తరలివెళ్లినవారు అంతా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.. ఇదే సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి రవాణా సంస్థలు.. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతోన్న ఏపీఎస్ఆర్టీసీ కూడా.. 50 శాతం అదనపు వడ్డింపు తప్పదని స్పష్టం చేసింది.. అయితే, దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. అసలే ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు…
శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. Read Also: తిరుపతి వాసులకు టీటీడీ…
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ రేటుకే భూములు అందించే ఉద్దేశంతో జగనన్న స్మార్ట్ టౌన్ (ఎంఐజీ -మిడిల్ ఇంకమ్ గ్రూప్ లేఅవుట్లు) ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో భూములను సమీకరించి అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. మిగిలిన జిల్లాలకు…
★ నేడు గుంటూరు జీజీహెచ్లో ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభం… వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం జగన్.. ఒక్కోటి వెయ్యి కిలో లీటర్ల సామర్థ్యమున్న రెండు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు★ చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో నేడు రెండోరోజు చంద్రబాబు పర్యటన… ఉదయం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ప్రజల నుంచి వినతుల స్వీకరణ… ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు★ ఇంటర్ ఫస్టియర్లో ఫెయిలైన వారికి కనీస మార్కులు వేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. నేటి…