ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వ్యవహారం కాస్త ముదిరి.. సమ్మెకు దారి తీస్తోంది.. ప్రభుత్వం చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతుంటే.. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన ఉద్యోగులు.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. అయితే, ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్, ర్యాలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్లను లంచ్ మోషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.. చట్టవిరుద్ధంగా ఏం జరిగినా దానిని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.. ఎలాంటి చర్యలు తీసుకునే స్వేచ్చ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
Read Also: కేరళలో తగ్గిన కోవిడ్ కేసులు..
ఉద్యోగులు చేసే పెన్ డౌన్ అయినా, సమ్మె అయినా అలాంటి కార్యక్రమం ఏం చేసినా రూల్ 4 కింద నిషేధం ఉందని విచారణ స్పందర్భంగా హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. అడ్వకేట్ జనరల్… అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా? అని హైకోర్టు ప్రశ్నించింది… విచారణ సందర్భంగా పరిపాలన సవ్యంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..