బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న.. అసలు మీకు ఇష్టం ఉందా? లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నాయి.. జిల్లా పేరు కోసం కొందరు.. జిల్లా కేంద్రం కోసం మరొకరు.. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇంకొద్దరు డిమాండ్ చేస్తున్నారు.. అలాంటి జిల్లాలో ఒకటి అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న సత్యసాయి జిల్లా.. దీనిపై ర్యాలీ చేసి దీక్షకు దిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. అన్ని రకాలుగా హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రంలో కార్యాలయాల ఏర్పాటుకు తగిన భూమి, వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన ఎల్ఐసీ..
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
అయితే, నందమూరి బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. ఎమ్మెల్యే బాలకృష్ణ మోసపూరిత పనులు మానుకోవాలని సూచించిన ఆయన.. హిందూపురం ప్రజలకు అనంతపురం కంటే పుట్టపర్తి చాలా దగ్గరగా ఉంటుందన్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే.. తెలపమని చెప్పాం.. ఎన్టీఆర్ అంటే అందరికి అభిమానం ఉంది.. అందుకే ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఎన్టీఆర్‌ను దూషించింది, వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని విమర్శించిన ఆయన.. ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా ఎన్ని కోట్ల మందికి భోజనం పెట్టారు? అని ప్రశ్నించారు.. హిందూపురంపై ప్రేమ ఉన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తారు? అని బాలయ్య, చంద్రబాబును టార్గెట్ చేసిన ప్రకాష్ రెడ్డి.. ఇన్ని రోజులు మంచి నీరు ఇవ్వలేకపోయారు.. వైఎస్ వచ్చిన తర్వాతే నీరు వచ్చిందన్నారు. అంతా ఎందుకు అసలు మీకు సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం ఇష్టం ఉందా? లేదా..? అంటూ బాలయ్యను సూటిగా ప్రశ్నించారు రాస్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. కాగా, హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తాను రాజీనామా చేస్తానని.. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ బాలకృష్ణ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!