ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ల సంఖ్యతో పాటు.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,838 శాంపిల్స్ పరీక్షించగా.. 3,396 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో తొమ్మిది మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు.. ఇక, ఒకే రోజు 13,005 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్ ల సంఖ్య 3,26,32,089కు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,00,765కి చేరగా, రికవరీ కేసులు 22,07,364కు పెరిగింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 14,655 మంది మరణించగా… ప్రస్తుతం రాష్ట్రంలో 78,746 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
Read Also: అనుమానాస్పదంగా తిరిగిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..