ఏపీలో ఎస్మా ప్రయోగంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ వైపు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఏపీ మైనింగ్ శాఖ ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్చల ప్రక్రియ మళ్లీ ప్రారంభమైందని అందరూ భావిస్తున్న తరుణంలో మైనింగ్ శాఖ ఎస్మా నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న.. అసలు మీకు ఇష్టం ఉందా? లేదా..?
ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ వెనక్కి తగ్గింది. గనులశాఖలో జారీ చేసిన ఎస్మా ఉత్తర్వులను గనులశాఖ ఉపసంహరించుకుంది. అవసరమైతే ప్రభుత్వమే ఎస్మా ఉత్తర్వులు జారీ చేస్తుందని గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతుండగానే ఈ మధ్యాహ్నం ఎస్మా జీవో విడుదలైంది. సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని వెంకటరెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.