మత్య్సకారులు కోసం రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. పవన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో సభకు వచ్చారు. కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ గార్డు అది గమనించి, సదరు అభిమానిని పట్టుకుని లాగాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి పవన్ ని పట్టుకోవడం, బాడీ గార్డు లాగడంతో సపోర్ట్ కోసం పవన్ ను పట్టుకోవడం, పట్టుకోల్పోయి అతను కిందకు దూకడం జరిగింది. ఈ హఠాత్పరిణామాల మధ్య పవన్ కారుపైనే జారి పడిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : LIVE: నరసాపురంలో పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ
ఇక మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న 217 జీవోపై గళం ఎత్తడానికి పవన్ కళ్యాణ్ ఈ మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం పోరాటం చేస్తూ ఈ రోజు నరసాపురంలో నిర్వహించిన ఈ సభకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మరోవైపు మత్స్యకార సొసైటీల పేరుతో చేపల చెరువులన్నీ దళారీల చేతిలో ఉన్నాయని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం 217 జీవో ద్వారా వేలం వేస్తున్నామని ప్రకటించింది. కానీ దీనిపై మత్స్యకారుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారికి తోడుగా కూడా జనసేనాని పోరాటం ప్రారంభించాడు. 217 జీవోను రద్దు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.