టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని…
టీడీపీ నేత, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయనో కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుందని అన్నారు. ఒక ఏడాదిలో 300 రోజులకుపైగా ఓవర్ డ్రాఫ్ట్.. వేస్ అండ్ మీన్స్కు వెళ్లిన చరిత్ర ఆయనది అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. Read Also: 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. మూడు రాజధానులు అలాగే వస్తాయి: మంత్రి…
మూడు రాజధానుల అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. అదే తరహాలో మూడు రాజధానులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల విభజన చారిత్రాత్మకం, అభివృద్ధి దాయకం అని ఆయన తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు మరోసారి పెంపు తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా…
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటితో ముగియాల్సిన గ్రూప్-4 ఉద్యోగాల గడువును మరోసారి ఏపీపీఎస్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగుల అభ్యర్థనతో ఏపీపీఎస్సీ మరోసారి గడువు పెంచింది. దీంతో ఫిబ్రవరి 6 వరకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. రెవెన్యూ డిపార్టుమెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ డెడ్‌లైన్ ఈరోజుతో ముగియాల్సి ఉంది. Read Also: ప్రధానికి సీఎం జగన్ లేఖ.. ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ..?…
ఈరోజు హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించాయి. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్పటికే తన నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్వవస్థీకరణ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.…
✪ తిరుమల: నేడు ఉ.9 గంటలకు ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల… ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు రోజుకు 10వేల సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనున్న టీటీడీ✪ విశాఖ: నేడు మూడోరోజు పీఆర్సీ సాధన సమితి నిరసన దీక్ష✪ అనంతపురం: హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ నేడు అఖిలపక్షం బంద్✪ సమ్మెకు సిద్ధం అవుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు.. కార్మిక సంఘాలతో ఈరోజు లేబర్ కమిషన్ అధికారుల సమావేశం✪ హైదరాబాద్: నేడు కలెక్టరేట్ల ముట్టడికి…
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన తర్వాత క్రమంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు కూడా రాశారు.. మధ్యప్రదేశ్,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదనపు అప్పు పొందేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌కు కూడా అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.7,309 కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,123 కోట్లు, రాజస్థాన్‌కు రూ.5,186 కోట్లు అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్లు పేర్కొంది. 2021-22…
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. ఇదే సమయంలో.. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సంఖ్య కూడా తగ్గిపోయింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 శాంపిల్స్ పరీక్షిచంగా.. 12,561 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. విశాఖలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు…