జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభలో పాల్గొన్నారు. మత్స్యకారులకు నష్టం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217కి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సభను ఏర్పాటు చేశారు. వైసీపీ పిచ్చిపిచ్చి వేషాలకు జనసేప బయపడదని అన్నారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడతానని, అవసరమైతే మత్స్యకారులకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాము సంయమనం పాటిస్తున్నామని, అదే మా బలం అని అన్నారు. సంయమనం మా బలహీనత కాదని పవన్ పేర్కొన్నారు. ఇక ఏపీలో రోడ్లన్నీ అస్తవ్యస్థంగా మారిపోయాయని, దారిపోడుగునా గోతులు తప్పితే ఏమీ కనిపించడం లేదని అన్నారు. ఒక్క మాట మాట్లాడాలి అంటే చాలా ఆలోచించి మాట్లాడుతానని, ఓ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతగా వ్యవహరిస్తానని అన్నారు.