ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.. నారాయణస్వామి వ్యాఖ్యలపై స్పందించిన ఫాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు.. మా ఉపాధ్యాయుల పిల్లల్లో 50 శాతం పిల్లలు ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుతున్నారు.. మరి మంత్రి నారాయణ స్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు..? అంటూ నిలదీశారు.. మంత్రి నారాయణ స్వామి బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని హితవుపలికిన ఆయన.. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక దాట వేసేందుకే మంత్రులు ఈ నాటకాలు…
పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ…
ఈ మధ్య గుంటూరులోని జిన్నా టవర్‌పై పెద్ద చర్చే సాగుతోంది.. గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడానికి పాకిస్థాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టారు.. అయితే, భారతీయ జనతా పార్టీ తరచూ దీనిని లేవనెత్తుతోంది.. రిపబ్లిక్ డే సందర్భంగా జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ‘హిందూ వాహిని’ పిలుపునివ్వడం కూడా రచ్చగా మారింది.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్నా టవర్‌పై ప్రభుత్వమే జాతీయ జెండాను ఎగురవేయాలని.. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ వాహినితో…
ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని రంగాల వారు సమ్మె బాట పడుతున్న సమయంలో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని సూచించిన ఆయన.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది.. వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా..? అని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్ గురించి టీచర్లు వాడిన భాష సరైంది కాదని హితవుపలికిన ఆయన.. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తున్నారా..?…
సమ్మెపై వెనక్కి తగ్గేదేలే అని తేల్చాశాయి ఉద్యోగ సంఘాలు.. ఇవాళ సమావేశమైన వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ.. సమ్మెపై ఓ నిర్ణయానికి వచ్చింది.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమావేశం తర్వాత మీడియాకు వెళ్లడించారు నేతలు.. వైద్యారోగ్య శాఖ గత రెండున్నరేళ్ల కాలంగా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తోన్నా.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. కరోనా కాలంలో సెలవులు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన రాక్షస అధికారుల పాలన సాగుతోందని ఆరోపించారు పీఆర్సీ…
న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచారణ సందర్భంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయపడింది ఏపీ హైకోర్టు. ట్విట్టర్లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్.. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు..…
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. కొత్త జిల్లాలపై ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను కొందరు ఏపీ సీఎం జగన్‌కు అన్వయిస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏపీ గురించి తనను అడగొద్దంటూ తెలంగాణలోని కొత్త జిల్లాల గురించి మాట్లాడారు. ఇక్కడ 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఏం సాధించారని షర్మిల ప్రశ్నించారు. కనీసం 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బందినైనా డిప్లాయ్…